
- రెవెన్యూ సమస్యలకు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా పరిష్కారం
- ఈ నెల 29న కలెక్టరేట్ ఆవరణలో పెద్దఎత్తున రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణ – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు సమగ్రంగా పరిష్కారం చూపేందుకు రెవెన్యూ క్లినిక్స్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణ, జనవరి 2 నుండి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే ఫేజ్–4 అమలుపై జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శ్రీ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ రాము నాయక్, నంద్యాల, డోన్, ఆత్మకూరు డివిజన్ల ఆర్డీఓలు, తహశీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఈ నెల 29వ తేదీన కలెక్టరేట్ ఆవరణలో పెద్దఎత్తున రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని ఆదేశించారు. వివిధ సమస్యలతో క్లినిక్స్‌కు వచ్చే అర్జీదారులు ఏ కౌంటర్‌ను సంప్రదించాలి, ఏ రకమైన దరఖాస్తులు సమర్పించాలి అనే అంశాలపై ముందుగానే వారికి స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా రెవెన్యూ క్లినిక్స్‌కు హాజరయ్యే అధికారులు సంబంధిత అన్ని రికార్డులు, దస్త్రాలతో సిద్ధంగా ఉండాలని, అర్జీదారులకు తక్షణమే సరైన మార్గనిర్దేశం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాదారు పాస్ పుస్తకాలను జనవరి 2వ తేదీ నుండి పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అలాగే రీసర్వే ఫేజ్–4 ప్రక్రియను సక్రమంగా, సమయపాలనతో నిర్వహించేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
- ABOUT US
- ACCIDENTS
- AISF
- AITUC
- AIYF
- APUWJ JOURNALISTS
- BANKS
- BC
- BJP
- CHRISTIAN
- CITU
- Contact Us
- CPI
- CPM
- DIPRO
- DM&HO – వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. వెంకటరమణ
- DOCTORS / HOSPITALS
- DRDA – VELUGU
- E-PAPER
- FIRE
- HOME
- ICDS
- IHRPC
- JANASENA
- MAHANANDI
- MP BYREDDY SHABARI
- MUSLIM
- POLICE
- RDO
- RGM COLLEGE
- RTO
- SCHOOLS
- SDPI
- SPORTS
- SRI RAMAKRISHNA DEGREE COLLEGE
- SSGRBCC
- TDP
- TEACHERS ASSOCIATION
- TEMPLES
- Uncategorized
- YSRCP
- అల్ మెవా
- ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్
- ఆయుష్ యోగా కేంద్రం
- ఏవీ సుబ్బారెడ్డి
- కండె శ్యాంసుందర్ లాల్ 12 వార్డ్ కౌన్సిలర్ TDP
- కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం
- ఖలీల్ TDP
- గోళ్ళ రాజేష్
- జమాతుల్ ఉలేమా వయిమ్మ పౌండేషన్
- డాక్టర్ రవి కృష్ణ
- డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్
- తాటికొండ బుగ్గ రాముడు 38 వార్డు ఇంచార్జ్
- నంది విజ్ఞాన కేంద్రం
- నంద్యాల జిల్లా
- నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
- నారాయణ పాండే హై స్కూల్
- నేషనల్ డిగ్రీ కళాశాల
- పీపుల్స్ హెల్త్ సొసైటీ
- బాల అకాడమీ పాఠశాల
- భూమా బ్రహ్మానంద రెడ్డి TDP
- మార్కెట్ ప్రసాద్
- మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు
- మున్సిపల్ కార్యాలయం
- రాయలసీమ సాగునీటి సాధన సమితి
- లయన్స్ క్లబ్
- విద్యార్థి సంఘాలు
- వ్యవసాయ అధికారి
- శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్
- శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం
- సీనియర్ న్యాయవాది,మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి
